Friday, April 26, 2024

సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు గ్రీన్‌ సిగ్నెల్‌.. విశాఖ జైల్‌ నుండి 40 మంది విడుదలకు ఏర్పాట్లు

ఆరిలోవ, (విశాఖపట్నం) ప్రభన్యూస్‌ : జెండాల పండుగ వారి కుటుంబాలలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్ల నుండి శిక్ష అనుభవిస్తున్న కొంత మంది ఖైదీలకు వారి కుటుంబాలలో వెలుగు నింపబోతుంది. వివిధ కారణాలతో గత కొన్ని సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటూ నాలుగు గోడల మధ్య దైనందన జీవితాన్ని నెట్టుకొస్తున్న కొంత మంది ఖైదీల విడుదల వారి కుటుంబాలకు సంతోషదాయకమే స్వతంత్ర దినోత్సవం. అజాదికా అమృత మహోత్సవం సంధర్బంగా ప్రభుత్వం సహృదభావంతో సత్పవర్తన కలిగిన ఖైదీలను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 175 మందిని స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

విశాఖ కేంద్ర కారాగారంలో సత్‌ ప్రవర్తన కలిగిన 40 మంది ఖైదీలను సోమవారం విడుదల చేసేందుకు జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌. రాహుల్‌ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో 33 మంది జీవిత ఖైదీలు కాగా ఏడుగురు శిక్ష ఖైదీలు ఉన్నట్లు పర్వేక్షణాధికారి రాహుల్‌ తెలిపారు. వీరిని సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement