Sunday, October 13, 2024

అంబులెన్స్ ట్రాకింగ్

అమరావతి,ఆంధ్రప్రభ: ఇప్పటివరకూ బస్సులు, ట్రై న్లు, విమానాలు వంటివి ఎక్కడున్నాయో తెలుసుకునే విధా నం ద్వారా ప్రయాణీకులు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే సంకేతికతతో 108 అంబులెన్స్‌లకు ట్రాకింగ్‌ విధానాన్ని తీసుకురాబోతోంది. ఎక్కడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే 108కి కాల్‌ చేసిన తర్వాత అది ఏ సమయానికి సంఘటన స్థలానికి వస్తుందో తెలియని పరిస్థితి. అంబులెన్స్‌ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటు-ంది. ఇకపై ఈసమస్యకు స్వస్తి చెబుతూ 108 అంబులెన్స్‌ ట్రాకింగ్‌ విధానాన్ని అందుబాటు-లోకి తీసుకురా వాలని ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. ఓలా, ఊబర్‌, రాపిడో వంటి వాహనాలను ట్రాక్‌ చేసే తరహాలోనే, 108 వాహనాలను కూడా ట్రాక్‌ చేసే విధానాన్ని వైద్య శాఖ ప్రవేశపెడుతోంది. దీనిద్వారా ఆపదలో ఉన్నప్పుడు విలువైన సమయాన్ని వృథా కాకుండా రోగి ప్రాణానికి ఇబ్బంది లేకు ండా ఉండేలా చూస్తోంది. ఒకవేళ 108 అంబులెన్స్‌ రావడం లేటయితే ప్రాణాలు పోయే పరిస్థితి లేకుండా తక్షణమే అక్కడ అందుబాటులో ఉన్న వేరే వాహనాన్ని తీసుకుని సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉండేలా చేస్తోంది.


ట్రయల్‌ రన్‌ విజయవంతం
త్వరలో అంబులెన్స్‌ల ట్రాకింగ్‌ అందుబాటు-లోకి రానుంది. దీనివల్ల బాధితులు 108కి కాల్‌ చేసిన తర్వాత వాహనం ఎక్కడ వరకు వచ్చింది? ఎంతసేపట్లో తమ వద్దకు వస్తుంది? ఎక్కడ ఉంది? వంటి అనేక అంశాలను ట్రాక్‌ చేసుకునే వీలుంటు-ంది. ఏ సమయానికి అంబులెన్స్‌ తమ వద్దకు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటు-ంది. ఇప్పటికే దీని ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తి కావడంతో అంబులెన్స్‌ల ట్రాకింగ్‌ సదుపాయాన్ని త్వరలో అందుబాటు-లోకి తీసుకురానున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆరోగ్యశ్రీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా అంబులెన్స్‌ వాహనాల ట్రా కింగ్‌ సిస్టమ్‌ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అంబులెన్స్‌ల ట్రాకింగ్‌పై మంత్రి విడదల రజిని
గిరిజన ప్రాంతాలలో అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాల ని సూచించారు. 108అంబులెన్స్‌లు ఘటన స్థలానికి చేరుకునే సమయంలో ఫోన్‌ చేసిన వారికి ఆ వాహనం ఎక్కడుందో తెలి యడం కోసంమొబైల్‌ ఫోన్‌కు రూట్‌ మ్యాప్‌ లింకు పంపేందుకు ప్రయోగా త్మకంగా చర్యలు తీసుకుంటు-న్నామని, త్వరలో అమలు చేస్తామని మంత్రి విడద ల రజిని వెల్లడించారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్‌గా చేయడానికి ప్రభుత్వం కృ తనిశ్చయంతో ముందుకు సాగుతోందని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద రూ. 10 వేల కోట్లు వెచ్చిస్తున్నామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద ప్రొసీజర్ల సంఖ్యను కూడా గణనీయంగా పెంచామని, త్వరలో అంబు లెన్స్‌లకు ట్రాకింగ్‌ విధానం తీసుకొస్తున్నామ ని, దీని ద్వారా బాధితులకు సమయం వృథా కాకుండా ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement