Friday, April 26, 2024

మున్సిపల్ టీచర్ల ప్ర‌మోషన్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

ప్ర‌భ‌న్యూస్ : మూడేళ్ల మున్సిపల్‌ టీచర్ల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ టీచర్ల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పదోన్నతులకు సంబంధించి డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 6 వరకు సీనియారిటీ జాబితాను రూపొందిస్తారు. 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, 10 నుంచి 13వ తేదీ వరకు పరిష్కరిస్తారు. 14న ఖాళీల జాబితా ప్రకటించి, 15 నుంచి 17 వరకు పదోన్నతుల ప్రక్రియను చేపడతారు.

17న పదోన్నతులు పొందిన వారికి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపల్‌ పాఠశాలల్లో భాషా పండిట్లు మినహా ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఖాళీలున్నాయి. గత మూడేళ్లుగా పదోన్నతుల ప్రక్రియ నిర్వహించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ కుంటుపడిందనే విమర్శలు నెలకొన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement