Wednesday, October 9, 2024

AP: నంద్యాల రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన గూడ్స్…

నంద్యాల బ్యూరో, అక్టోబర్ 1 (ప్రభ న్యూస్) : సౌత్ సెంట్రల్ రైల్వే మార్గంలోని నంద్యాల రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలు తప్పిన వైనం చోటుచేసుకుంది. స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల మేరకు… మంగళవారం ఉదయం రైలు స్టేషన్ లోకి రాగానే ఐదో ఫ్లాట్ ఫారం వద్ద పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పట్టాలు తప్పి కిందికి ఒరిగాయి.

ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం విశేషం. ఆ ప్రాంతంలో ప్రయాణికులు కూడా ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పట్టాలను పునరుద్ధరించారు. సాంకేతిక నిపుణులు అప్పటికప్పుడు వచ్చి రైల్వే ప్లాట్ ఫారంలోని పట్టాలు తప్పిన వాటిని పునరుద్ధరించారు. ఈ గూడ్స్ రైళ్లు విజయవాడ నుంచి బళ్లారి సైడ్ వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింది. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేదని రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటాద్రి దొరస్వామి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement