Wednesday, April 17, 2024

విశాఖలో తెలుగుభాషా దినోత్సవం

తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు. అందుకే ఆయనను తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. గ్రాంథికభాషలో పండితులకు మాత్రమే అర్థం అయ్యేలా ఉన్ తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు. తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదుతో ఆయనను సత్కరించింది. ‘కైజర్ ఈ హింద్’ బిరుదు ఆయనను వరించింది. 22 జనవరి,1940న మరణించేంతవరకు తెలుగు భాషే ఊపిరిగా ఆయన జీవించారు.

గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా విశాఖపట్నంలో ఈనెల 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు భాషా, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి రజిత్‌ భార్గవ్‌ తెలిపారు. విశాఖలో ఉడా చిల్డ్రన్‌ థియేటర్‌లో ఈ వేడుకలను కోవిడ్‌ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తామన్నారు.    

Advertisement

తాజా వార్తలు

Advertisement