Thursday, September 21, 2023

Big Breaking | విశాఖలో ఘరానా మోసం.. 2వేల నోట్లతో కోటి ఇస్తానని..

విశాఖలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లాకు చెందిన ఓ వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. 500 రూపాయల నోట్లతో 90 లక్షల రూపాయిలు ఇస్తే.. 2 వేల రూపాయల నోట్లతో కూడిన కోటి రూపాయల అమౌంట్​ ఇస్తామని నమ్మించాడు. దీనిపై కాకినాడకు చెందిన ఓ వ్యాపారికి విశాఖ వాసి ధర్మరాజు ఆఫర్​ చేశాడు.

- Advertisement -
   

అయితే.. దీన్ని నమ్మి, పెద్ద మొత్తంలో డబ్బు తేరగా వస్తుందని ఆశపడ్డ కాకినాడ వ్యాపారి తన ఫ్రెండ్​కు 90 లక్షల రూపాయలు ఇచ్చి పంపించాడు. అయితే.. వారి దురాశను ఆసరగా చేసుకున్న విశాఖ వాసి.. అతడిని మస్కా కొట్టి 60 లక్షలు ఎత్తుకెళ్లాడు. దీంతో లబోదిబో మంటూ పోలీసులను బాధితుడు ఆశ్రయించడంతో గంటల వ్యవధిలోనే కేసు ఛేదించారు. నిందితులను అరెస్ట్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement