Thursday, December 1, 2022

విశాఖ విమానాశ్రయ సలహామండలి సభ్యుడిగా గంట్ల.. ఉత్తర్వులు అందజేసిన విమానాశ్రయ డైరెక్టర్

సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబును విశాఖ విమానాశ్రయ సలహా మండలి సభ్యుడిగా నియమించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విమానాశ్రయం డైరెక్టర్ కె. శ్రీనివాసరావు మంగళవారం శ్రీనుబాబుకు అందజేశారు. రెండేళ్ల పాటు శ్రీనుబాబు ఈ పదవిలో కొనసాగనున్నారు. విశాఖ విమానాశ్రయ అభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని డైరెక్టర్ కోరారు.

- Advertisement -
   

సభ్యుడిగా నియమితులైన శ్రీనుబాబు మాట్లాడుతూ దేశములో శరవేగముగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు విమానాశ్రయమే అత్యంత కీలకమన్నారు. విశాఖ నుంచి మరిన్ని ప్రాంతాలకు కొత్త సర్వీస్ లు, కార్గో సర్వీస్ లు నడపగలిగితే పర్యాటకుల సంఖ్య, వ్యాపార అభివృద్ధి ఘన నీయంగా పెరుగుతుందన్నారు. తద్వారా విమానాశ్రయ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందన్నారు.. విమానాశ్రయ అభివృద్ధికి తమ పరిధి మేరకు కృషి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement