Thursday, April 25, 2024

నారా లోకేష్ తో గంటా శ్రీనివాస‌రావు భేటి…

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిసారు. జూబ్లీహిల్స్ లోని లోకేశ్ నివాసానికి వచ్చిన గంటా దాదాపు 40 నిమిషాల సేపు నారా లోకేష్ తో వివిధ అంశాల‌పై చర్చించారు. పార్టీ పట్ల తన వైఖరిని ఆయన లోకేశ్ కు వివరించినట్టు స‌మాచారం. కాగా, .గత ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాల్లో గంటా పెద్దగా పాల్గొన్నది లేదు. ఈ నేపథ్యంలో లోకేశ్ తో గంటా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement