Tuesday, September 26, 2023

Prakasam – ఆర్టీసీ బస్సు, కారు ఢీ – నలుగురి దుర్మరణం

త్రిపురాంతకం: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని హైవేపై ఆదివారం రాత్రి 10.15 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన సాయి(26), పిల్లి శ్రీనివాస్‌(23), చంద్రశేఖర్‌ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108లో వినుకొండకు తరలించారు. మార్గంమధ్యలో శకంర్‌ (24) మృతిచెందాడు. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్‌ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఎస్సై జీవీ సైదులు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement