Saturday, April 20, 2024

మరో నాలుగు రోజులు వర్షాలేజ‌.. ఉత్తరకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అల‌ర్ట్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఉపరితల ఆవర్తనం, దక్షిణ బంగాళాఖాతం నుంచి 45 నుంచి 55 కిమీ వేగంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం కారణంగా ఈనెల 5,6 తేదీల వరకు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. దీంతో దక్షిణ కోస్తాకు ఎలాంటి వర్ష సూచనలు లేవు. నైరుతి రుతుపవనాల ప్రభావర ఉత్తర కోస్తాంధ్ర, యానాంపై అధికంగా ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈనెల 5 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను వాతావరణశాఖ జారీ చేసింది. అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement