Friday, March 29, 2024

ఏపీలో మరో నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం

ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఈ నెల 23న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. అంతేకాకుండా మరో నలుగురిని బదిలీ చేస్తూ తాజాగా నిన్న మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న స్వప్నిల్ దినకరన్‌ను గతంలో చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవన్యూ)గా బదిలీ చేసింది. అలాగే, శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్ గా ఉన్న సుమిత్ కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా బదిలీ చేయగా, తాజాగా వీరిద్దరినీ యథా స్థానాలలోనే కొనసాగిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సెర్ప్ సీఈవో పి.రాజబాబును చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ గా, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్‌ను సెర్ప్ సీఈవోగా, వెయిటింగ్‌లో ఉన్న గంధం చంద్రుడిని మైనారిటీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా, చేనేత సహకార సంస్థ వీసీ అండ్ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా బదిలీ చేసింది.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement