Tuesday, April 16, 2024

ఏపీలోని ఆ నాలుగు జిల్లాల్లో డేంజర్‌ లెవల్‌లో ఫ్లోరైడ్‌..

భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ శాతం ఏపీలోని మిగతా జిల్లాల కన్నా ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పరిసర గ్రామాల్లో ఫ్లోరైడ్ లో ఉంటే పార్ట్‌ఫర్‌ మిలియన్‌ (పీపీఎం) సాధారణ స్థాయిని మించి ఉంటుది. వర్షాలు ఎక్కువగా కురిసి భూగర్భ జలాల నీటి మట్టం పెరిగినపుడు చేసే నమూనా పరీక్షల్లో తక్కువగా ఉన్నట్టు- కనబడినా నీటి మట్టం తగ్గినపుడు పీపీఎం ప్రమాదకర స్థాయిలో ఉంటోంది.

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని కరవు పీడిత గ్రామీణ ప్రాంతాలను ఫ్లోరైడ్ పట్టి పీడిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి గడిచిన ఆరునెలల సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని మంచినీటి వనరులను గుర్తించి నమూనాలను సేకరించి నిర్వహించిన పరీక్షల్లో ప్లnోరైడ్‌తో పాటు- ప్రమాదకర కాలుష్యాలున్నట్టు- గ్రామీ ణ మంచినీటి పథకం (ఆర్‌.డబ్ల్యు.ఎస్‌) అధికా రులు గుర్తించారు. సేకరించిన నమూనాల్లో 3.5 శాతం ఫ్లోరైడ్ ఉన్నట్టు నిర్దారణ అయింది. గడిచిన ఆరు నెలల కాలంలో 1,99,785 నీటి నమూనాలు సేకరించగా వాటిలో 1,80,608 నమూనాలను పరీక్షించారు. వాటిలో 6,432 నమూనాల్లో ప్లnోరైడ్‌, ఇతర ప్రమాదకర కాలుష్యాలను గుర్తించారు.

గతంతో పోలిస్తే ఫ్లోరైడ్ శాతం బాగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. గతంలో పరీక్షించిన నమూనాల్లో 15 శాతం ప్లోరైడ్‌ ఉన్నట్టు తేలింది..ఇపుడు కేవలం 3.5 శాతం నమూనాల్లో మాత్రమే ప్లnోరైడ్‌ కనబడింది..ప్లnోరైడ్‌ను గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు రక్షిత నీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

గడిచిన ఏడాదికాలంగా వర్షాలు బాగా కురవటంతో భూగర్భ జలాలు నీటి మట్టం పెరగటంతో ప్లnోరైడ్‌ శాతం తగ్గిందనీ.. మళ్ళీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడి భూగర్భ నీటి మట్టం తగ్గిన తరువాత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో మళ్ళీ యధావిధి పరిస్థితులు నెలకొంటు-న్నాయి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత నీటిని అందించటమే శాశ్వత పరిష్కారమని గ్రామీణ మంచినీటి రంగంలో పనిచేస్తున్న నిపుణులు చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కొళాయి ద్వారా సురక్షిత మంచినీటిని అందించే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా అమలవుతున్న జలజీవన్‌ మిషన్‌ పథకం కూడా ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించే ప్రత్యామ్నాయ నీటి వనరుల గుర్తింపు, నమూనాల శాస్త్రీయ పరీక్షలపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీటి నమూనా పరీక్షల్లో ఏపీ తొలిస్థానం దక్కించుకుంది. సేకరించిన 1,99,785 నమూనాల్లో 1,80,608 నమూనాలను పరీక్షించి ఏపీ మొదటి స్థానం దక్కించుకోగా..1.49 లక్షల నీటి నమూనాలు సేకరించి అందులో 1.29 లక్షల పరీక్షలు నిర్వహించి మధ్య ప్రదేశ్‌ ద్వితీయ స్థానం దక్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement