Friday, June 2, 2023

అల్లూరి జిల్లాలో బస్సు బోల్తా.. న‌లుగురు మృతి, 40 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో న‌లుగురు చ‌నిపోకాయారు. 40 మంది దాకా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిట‌ల్‌కు తరలించారు.

సంగీత ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒడిశాలోని భవానీపట్నం నుంచి విశాఖ‌కు వ‌స్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులంతా ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement