Thursday, December 5, 2024

AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. చంద్ర‌బాబు సంతాపం

టీడీపీ మరో సీనియర్‌ నేతను కోల్పోయింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు.. ఆయన వయస్సు 99 ఏళ్లు. ఈ ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు రెడ్డి సత్యనారాయణ.. గత కొంతకాలంగా వయసు రీత్యా, మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన.. ఇవాళ‌ మృతిచెందారు.

అయితే, స్వర్గీయ ఎన్టీఆర్‌ హయాంలో మంత్రిగా సేవలు అందించారు.. మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆయన తిరుగులేని విజయాలను అందుకున్నారు. ఇక, ఆయనను మంత్రిని చేసిన ఎన్టీఆర్‌.. పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సహా పలువురు మంత్రులు.. వివిధ పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఇక, రేపు (బుధవారం) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement