Saturday, April 20, 2024

ఏపీ మాజీ మంత్రి నారాయ‌ణ‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. గత సంవత్సరం పదో తరగతి పరీక్షల సందర్భంగా చిత్తూరు జిల్లా నెల్లేపల్లి జడ్పీ హైస్కూల్ లో ప్రశ్నాపత్రం లీకైంది. తెలుగు సబ్జెక్టు ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటికి వచ్చిన ఘ‌ట‌న‌లో పోలీసులు మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణ పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గతేడాది మే నెలలో నారాయణను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు బెయిల్ లభించగా, ఆ బెయిల్ ను హైకోర్టు రద్దు చేయ‌డంతో నారాయణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నారాయణ బెయిల్ రద్దు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. పేపర్‌ లీకేజ్‌ కేసులో హైకోర్టు రిమాండ్‌ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement