Saturday, October 5, 2024

AP | టీడీపీ గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రజాసమస్యల పరిష్కారం కోసం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌కు వందలాది ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చి తమ గోడు చెప్పుకొని, పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు జీవీరెడ్డి, వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, బుచ్చి రాంప్రసాద్‌లకు భూకబ్జాలు, బెదిరింపులు, గత ప్రభుత్వంలోని దౌర్జన్యాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. వాటిపై స్పందించిన నేతలు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement