Wednesday, April 24, 2024

మళ్లి వరద భయం.. పెరుగుతున్న శబరి, గోదావరి నదులు

చింతూరు, (అల్లూరి) ప్రభ న్యూస్‌: చింతూరు మన్యంలోని రహదారులపై వాగుల వరద నీరు చేరుకుంది. ఏజేన్సీలోని ఉన్న శబరి నది క్రమేపీ పెరుగుతూ సోమవారం సాయంత్రానికి 29 అడుగుల కనిష్ట స్థాయి వరద నమోదు అయింది. మన్యంతోపాటు ఎగువ ప్రాంతాల్లో మూడు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఆయా వరద నీరు శబరి నదిలో చేరుకొని నెమ్మదిగా పెరుగుతోంది. ఆంధ్రా సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సైతం వర్షపాతం ఎక్కువ నమోదవుతుండటంతో చింతూరు ఎగువ ప్రాంతాలైన బలిమెల, డొంకరాయి, సీలేరు డ్యాంలలో వరద చేరుతోంది ఇది ఇలా ఉంటే భద్రాచలం వద్ద వరద నీరు 36.5 అడుగుల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.

రహదారులపై చేరిన వాగుల వరద నీరు..

చింతూరు మన్యంలోని శబరి నదికి అనుసంధానమైన వాగులు, వంకలు సోకిలేరు, కుయుగూరు, అత్తకోడళ్లు, చంద్రవంక వాగులు సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. చుటూరు – ముకునూరు గ్రామాల మధ్య ఉన్న సోకిలేరు వాగు పొంగి చింతూరు – వీఆర్‌ పురం మండలాలతో పాటు పలు గిరిజన గ్రామాలకు, కుమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రవంక వాగు పొంగి రహదారిపై చేరడంతో కుమ్మూరు పంచాయతీలోని పలు గ్రామాలకు, చదలవాడ పంచాయతీ పరిధిలోని గిరిజన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అంతర్రాష్ట్ర రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. ఆంధ్రా – ఒరిశా రాష్ట్రాల మధ్య గల కుయుగూరు వాగు పొంగి జాతీయ రహదారిని ముంచడంతో ఒడిశా – ఆంధ్రా రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రమాదం అని తెలిసిన ప్రయాణాలు..

చింతూరు మన్యంలోని శబరి నది క్రమేపీ పెరుగుతుండటంతో శబరి నదికి అనుసంధానం అయిన సోకిలేరు, కుయుగూరు వాగులు పొంగుతూ రహదారులను ముంచెత్తాయి. ఈ క్రమంలో రహదారుల మీద వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటకీ ప్రమాదం అని తెలిసినప్పటకీ ఆ ప్రమాదభరితంగా ప్రవహిస్తున్న వాగుల వరద నీటిలో ప్రజలు ప్రయాణాలు కోనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే సోకిలేరు వాగు భుజాల వరకు వస్తున్న జనాలు వాగులు దాటుతున్నారు. అదే విధంగా కుయుగూరు వాగు వరదనీటి నుండి సైతం ప్రజలు రాకపోకలు సాగించడంతో పాటు వాహనాలు సైతం ఆ వరద నీటిలో ప్రమాద పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. వరద నీటిలో ప్రజలు దాటుతున్నప్పటకీ ఏ ఒక్క అధికారి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏదైనా జరగరానిది జరగక ముందే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వాగులు, వంకలు దాటకుండా పటీష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement