Thursday, April 25, 2024

Flash.. Flash: నూజివీడు త్రిబుల్ ఐటీ రోడ్ లో మెగా గ్యాస్ పైప్ లైన్ లీక్

నూజివీడు (ప్రభా న్యూస్): నూజివీడు ట్రిపుల్ ఐటీ రోడ్డులో మెగా గ్యాస్ పైపు లైన్ శనివారం సాయంత్రం లీక్ అయ్యింది. నీటి కుంటలో ఎగజిమ్ముతున్న గ్యాస్ ఉధృతితో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.

నూజివీడులో వరుస గ్యాస్ లీకుల ఘటనలతో పరిసర ప్రాంత ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ,పెట్రోల్ బంక్ ఉండడంతో అధికారులు సహాయక చర్యలు వేగ‌వంతం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ, పోలీస్ సిబ్బంది గ్యాస్ లీకేజీని అదుపు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement