Wednesday, March 27, 2024

ఆనంతపురంలో మరో విషాదం – ఆక్సిజన్ అందక క్యాన్సర్ హాస్పిటల్ లో ఐదుగురు మరణం

ఆనంతపురం: అనంత లో మరో విషాదం చోటు చేసుకుంది. క్యాన్సర్‌ ఆస్పత్రిలో కరోనా రోగులు ఐదుగురు మృతి చెందారు. ఆక్సిజన్‌ కొరత వల్లే చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం ఏడు గంటలకు ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ చంద్రుడు, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆస్పత్రిలో పరిస్థితిని సమీక్షించారు కాగా ఇటీవల అనంతపురం జనరల్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 10 మంది రోగుల మృతి చెందారు. అదే రోజు కర్నూలు కేఎస్‌ కే‌ర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారు. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే మరో ఆస్పత్రిలో ఐదుగురు మరణించడం విషాదం.

ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్‌లో లోపం వల్లే మరణాలు

కేన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్‌లో లోపం జరగడం వల్లే నలుగురు చనిపోయారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల ఐదుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ చంద్రుడు, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆస్పత్రిలో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ‘‘ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి చివరి నిమిషాల్లో ఇక్కడికి తరలి ఇస్తుండటం వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్‌ను కోవిడ్ బాధితులకు నేరుగా బంధువులు పెడుతుండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వీటిపై బుధవారం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.’’ అని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

అధికారులకు షోకాజ్ నోటీసులు – కలెక్టర్ గంధం చంద్రుడు

క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపాల విషయమై మరియు ఇతర కారణాలను తెల్పుతూ క్యాన్సర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ భాస్కర్ కు మీ పై ఎందుకు చర్య తీసుకోకూడదు అని షోకాజ్ నోటీసులు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జారీ చేశారు .అదే విధంగా క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా ఆక్సిజన్ ప్లాంట్ నిర్వాహకులు వారాశి ఏజెన్సీ కి కూడా మీ కాంట్రాక్ట్ ను ఎందుకు రద్దు చేయకూడదు అని షోకాజ్ జారీ చేశారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement