Saturday, April 20, 2024

తొలి ప్రైవేట్ రాకెట్‌ విజయవంతం.. ఇస్రోను అభినందించిన గవర్నర్

నెల్లూరు : శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రైవేట్‌గా నిర్మించిన తొలి రాకెట్‌ విక్రమ్‌-ఎస్ ను కాసేప‌టి క్రితం విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. భారత అంతరిక్ష యాత్రలో ఇది ఒక మైలురాయి వంటిదన్న గవర్నర్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడడం ఒక చారిత్రాత్మక సందర్భమన్నారు. రాకెట్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి అభినందనలు తెలిపారు. మూడు పేలోడ్‌లను మోసుకెళ్లటం, అందులో ఒకటి మన భారతీయ విద్యార్ధుల భాగస్వామ్యంతో తయారు కావటం ముదావహమని గవర్నర్ హరిచందన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement