Saturday, March 25, 2023

దుకాణ స‌ముదాయంలో అగ్నిప్ర‌మాదం.. రూ.50ల‌క్ష‌ల ఆస్తిన‌ష్టం

ఆల‌య దుకాణ స‌ముదాయంలోని ఓ దుకాణంలో మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి ప‌క్క‌న ఉన్న దుకాణాల‌కు అంటుకోవ‌డంతో భారీగా మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. ఈ సంఘ‌ట‌న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ దుకాణ సముదాయంలో చోటు చేసుకుంది. కాగా మొత్తం 20 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే మంటలు అంటుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒక్కో దుకాణంలో రూ.2 నుంచి రూ.3 లక్షల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయని వ్యాపారులు వాపోతున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement