Friday, March 29, 2024

Breaking: చెన్నై వెళ్తున్న‌ నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. కాలిపోయిన బోగీ

న‌వ‌జీవ‌న్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు చెల‌రేగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా గూడూరులో ఇవ్వాల (శుక్ర‌వారం) ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గూడూరు జంక్షన్‌ సమీపంలో రైల్‌లో మంటలు చెల‌రేగ‌డంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంట‌ల‌ను ఆర్పేయ‌డంతో పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గూడూరు జంక్షన్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి.

రైల్‌లోని ప్యాంట్రీ కార్‌లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన అధికారులు రైలును గూడూరు రైల్వే స్టేషన్‌లో ఆపేశారు. వెంటనే అగ్నిమాపక, రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బోగీ సగం కాలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. బోగీలో మంటలు చెలరేగడానికి కారణాలపై ఆరా తీస్తున్న‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement