Tuesday, April 16, 2024

Breaking: 3 రాజధానుల రద్దు బిల్లు.. మండలిలో ప్రవేశపెట్టిన బుగ్గన

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు నిన్న ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..  నేడు ఇందుకు సంబంధించిన బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి  ప్రభుత్వం ధ్యేయం అని అన్నారు.  ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకుంటే ఎప్పటికైనా వేర్పాటువాద ముప్పు తప్పదని అభిప్రాయపడ్డారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ కేంద్రంగా అభివృద్ధి జరిగిందన్న మంత్రి బుగ్గన.. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని మంత్రి బుగ్గన వివరించారు. ఒక ప్రాంతమే ఎక్కువగా అభివృద్ధి చెందడంతో ప్రత్యేకవాదం వచ్చిందని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, అందుకే అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాయిని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం అమాయకుల నుంచి 33వేల ఎకరాలను సేకరించిందన్నారు. 50 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే కనీస అవసరాలకే రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. రాజధాని అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదన్న మంత్రి బుగ్గన.. ఒకే చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement