Thursday, April 18, 2024

Tarak | ఎన్నికలలో పోటీ చేస్తా.. సినీ నటుడు నందమూరి తారకరత్న

గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనున్నట్టు సినీ నటుడు నందమూరి తారకరత్న వెల్లడించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని పాలపర్రు గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తారకరత్న ప్రసంగాన్ని కొనసాగిస్తూ తాను చంద్రబాబు, బాలకృష్ణ ల అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చంద్రబాబు తెలిపారు.

తాను ఎన్నికల ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయగలనని వెల్లడించారు. గత మూడున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నదని తారకరత్న చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement