Friday, April 19, 2024

Big Story | నీటివాటాలపై జలపోరు.. కృష్ణా నదీ జలాల వివాదాలపై రేపు కీలక భేటీ

మహారాష్ట్ర పశ్చిమ కనుముల్లో పుట్టి కర్నాటక, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తున్న కృష్ణా నదీ తనతో పాటే వివాదాలను కూడా మోసుకువెళ్లుతుంది. తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంచాయితీ ఎనిమిదేళ్లుగా ముదురుతున్నా పరిష్కారం వైపుకు వెళ్లడంలేదు. ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు కృష్ణానదీ యాజమాన్యం బోర్డు తెలుగు రాష్ట్రాల ఇంజనీరింగ్‌ చీఫ్‌ లతో సమావేశాలు ఏర్పాటుచేసి తాత్కాలిక ఒప్పందాలు కుదిర్చినా సమస్య శాశ్వత పరిష్కారానికి నోచుకోలేదు. 5వ పర్యాయం రేపు (శనివారం) ఆంధ్ర, తెలంగాణ ఇంజనీరింగ్‌ చీఫ్‌ లతో కృష్ణా జలాల పంపిణీ పై చర్చించేందుకు కెఆర్‌ఎంబీ ఆహ్వానాలు పంపించింది.

– హైదరాబాద్‌, ఆంధ్రప్రభ

తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకాకుంటే కేఆర్‌ఎంబీ స్వతహాగా నీటి పంపకాలు చేసే అధికారం ఉందని అధికారులు చెప్పారు. ఉదయం 11 గంటలకు జలసౌధలో తెలంగాణ,ఆంధ్ర ఇంజనీరింగ్‌ చీఫ్‌ లతో కేఆర్‌ఎంబీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న అభ్యంతరాలు, రాసిన లేఖలపై మొదట సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో ఇప్పటికే తెలంగాణ ప్రాజెక్టులను ఆక్షేపిస్తూ ఆంధ్ర లేఖలు రాసింది.. పాలమూరు, రంగారెడ్డి, డిండీ, కల్వకుర్తి, భక్తరామదాసుకు నికర జలాలులేకపోయినప్పటికీ తెలంగాణ నిర్మిస్తూ కృష్ణాజలాలను అధికంగా ఉపయోగించుకుంటుందని ఆంధ్ర ఆరోపించింది.

- Advertisement -

ఈ అంశాలపై చర్చ అనంతరం తెలంగాణ అభ్యంతరాలను చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యూలేటరీ సామర్ధ్యం పెంపు, సంగమేశ్వర ప్రాజెక్టు, హంద్రీనీవా ప్రాజెక్టుల పై అభ్యంతరాలు చెప్పనుంది. అలాగే నాగార్జున సాగర్‌ కుడికాలువకు సమానంగా ఎడమ కాలువకు నీటి కేటాయింపులుఉండాలని తెలంగాణ పట్టుబట్టనుంది. పట్టిసీమలో వాటాకావాలని ఇప్పటికే తెలంగాణ డిమాండ్‌ చేస్తుంది. అలాగే ఈ సమావేశంలో రూల్స్‌ కర్వ్యూ , నీటి పంపకాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జవిద్యుత్‌ కేంద్రాలకు కేటాయింపులపై సుధీర్ఘంగా చర్చ జరగనుంది.

నీటివాటాలపై వివాదాలు

తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన త‌ర్వాత కూడా నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఈ సమావేశంలో ఇంజనీరింగ్‌ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ వివరించనున్నారు. బేసిన్ల లెక్కల ప్రకారం చూసినా, కృష్ణానదీ పరివాహక ప్రాంతాలను పరిగణలోకి తీసుకున్నా ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణకు అధిక వాటా రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేయించిన 811 టీఎంసీ ల్లో ఆంధ్రకు 512టీఎంసీ, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలను కేటాయించి అన్యాయం చేశారని తెలంగాణ వాదిస్తోంది.

కనీసం తెలంగాణకు 575 టీఎంసీలు రావాలని డిమాండ్ వినిపిస్తున్నారు అధికారులు. అలాగే వినియోగించుకోని నికరజలాలను తిరిగి నీటి కేటాయింపుల్లో చేర్చకూడదని వాదించనున్నారు. నీటి వాటాలు తేల్చి పాలమూరు రంగారెడ్డికి 90టీఎంసీలు, డిండీ కి 30 టీఎంసీలు, ఏఎంఆర్‌ ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, నెట్టెంపాడుకు 25టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement