Wednesday, April 24, 2024

ఫీజులు వ‌సూలుకాక‌.. అప్పులు చెల్లించ‌లేక‌.. దంపతుల ఆత్మహత్య!

పాఠశాల పెట్టినా.. ఫీజులు వసూలు కాకపోవడం, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా, కరోనా ప్రభావంతో బడి మూతపడడం.. అప్పులిచ్చిన వారంతా ఒత్తిడి తేవడం వంటి కారణాలతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం క‌ర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది.

స్థానిక వివరాల ప్రకారం… కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం (33), కోడలు రోహిణి (27) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. భార్యాభర్తలిద్దరూ గత నాలుగేళ్లుగా పట్టణంలో లైఫ్‌ ఎనర్జీ పాఠ‌శాల‌ను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆత్మ‌కూరు మండ‌లం క‌రివెన స‌మీపంలో కారులో సుబ్ర‌హ్మ‌ణ్యం, రోహిణి విష గుళిక‌లు మింగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు వారిద్దరూ సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఈ విషయం  విషయం వెలుగు చూసింది.. ‘ఈ రోజు నేనూ, నా భార్య చనిపోతున్నాం. అందరూ క్షమించాలి. విద్యార్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి. మాకు ఫీజులు రాక, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఇలా చేసుకోవాల్సి వస్తోంది’’ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సంచలనం కలిగించింది. 

విషయం తెలిసి జనం వారి ఇంటి వద్దకు చేరారు. సుబ్రహ్మణ్యం భార్య రోహిణి స్వగ్రామం ఆత్మకూరు. వారు ఆత్మకూరు నుంచి కోవెలకుంట్లకు వస్తూ మార్గమధ్యలో విష గుళికలు మింగారు. విషయం తెలుసుకున్న బంధువులు స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే భర్త మృతి చెందాడు. రోహిణిని కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. స్కూల్ కోసం సుమారు రూ.2 కోట్ల వరకు అప్పు చేసి ఉంటారని స్థానికులు తెలిపారు. ఇద్దరి మృతితో వారి కుటుంబీకులు రోధించడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement