Saturday, December 7, 2024

వర్షాలు కోసం ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో వర్షాలు కోసం రైతులు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు లేక వరి పంటకు సంబందించిన అకు మడులు పూర్తిగా ఎండిపోతున్నాయి. గతంలో కురిసిన వర్షాలకు రైతులు మొక్కజొన్న, పత్తి తదితర పంటలు సాగు చేశారు. పంటలు సాగు చేసినప్పటి నుంచి సరైన వర్షం కురవకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్థులంతా కలిసి వర్షం కోసం గ్రామంలోని నీలకంఠశ్వర ఆలయంలో రైతులంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి జాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులుతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement