Tuesday, April 23, 2024

ఏసీబీ అధికారులంటూ పూజారికి టోకరా – బంగారం, నగదుతో ఉడాయింపు

దుగ్గిరాల మే 18(ప్రభ న్యూస్) మాకు మీ మీద ఫిర్యాదు ఉంది..ఏసీబీ అధికారులము అంటూ గుర్తు తెలియని వ్యక్తులు విశ్రాంత పూజారిని మోసగించిన సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని కంఠమరాజు కొండూరు గ్రామంలో నివాసం ఉంటున్న విశ్రాంత అర్చకులు పావులూరి తారకనాథ్ శర్మ ఇంటివద్ద గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే ఏసీబీ అధికారులమంటూ ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి మోసం చేశారని దుగ్గిరాల పోలీసులకు తారకనాధ్ ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి తలుపుతట్టి ఇంటి లోపలకు వచ్చి మేము ఏసిబి అధికారుల మంటూ చెప్పి తమ దగ్గర ఉన్న బంగారు రుద్రాక్ష మాల, పోగులు,50 వేలునగదుతో పాటుగా,లక్ష, వంద చెక్కు పైన సంతకాలు తీసుకెళ్ళినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు గంట పాటు వారి ఇంట్లోనే అర్చకుల ఫోన్లు తీసుకోని బయటకు రాకుండా బెదిరించి, నగదు బంగారం తీసుకెళ్లడంతో మోసపోయామని గుర్తించి, పోలీసులు సమాచారం అందించారు. తారకనాథ్ శ్రీమహంకాళి అమ్మవారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తూ పదవి విరమణ చేసి ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు.సంఘటన స్థలాన్ని రూరల్ సిఐ భూషణం పరిశీలించి వివరాలు సేకరించారు.

భయందోళనకి గురిచేశారు.. బాధితులు తారకనాధ్
ఏసీబీ అధికారులు అంటూ తెల్లవారుజామునే మా ఇంటికి వచ్చి మమ్మల్ని భయాందోళన గురి చేశారని బాధితుడు తారకనాథ్ పేర్కొన్నారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులను అన్నిటినీ సోదా చేసి పత్రాలను ఫొటోస్ తీసుకొని తమ వద్ద ఉన్న బంగారపు రుద్రాక్ష మాల, బంగారపు పోగులు,50 వేల రూపాయలు, లక్ష బ్యాంక్ చెక్ తీసుకు వెళ్లినట్లు చెప్పారు. ఎవరికీ చెప్పి సమస్యలు కొని తెచ్చుకోవద్దని ఏదైనా ఉంటే మాట్లాడదామంటూ వారి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లినట్లు తారకనాథ్ చెప్పారు. వారు ఇచ్చిన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని, ఆ నెంబర్ కి మాజీ జేడీ లక్ష్మీనారాయణ తో దిగిన ఫోటో ఉన్నట్లు ఆయన వచ్చిన వ్యక్తుల్లో ఒకరి ఫోటో మీడియాకి చూపించారు. అయితే సదర్ వ్యక్తి గత ఆదివారం ఒకసారి కాల్ చేసి వివరాలు అడిగి మాట్లాడాలి అని అన్నట్లు, ఉత్సవాలు ఉండటంతో బుధవారం కలుద్దామని చెప్పానని అయితే తెల్లవారుఝామున కాల్ చేసినట్లు అప్పటికే ఇంటివద్ద ఉన్నామని గేట్ తీయాలని చెప్పి ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చి సోదాలు చేసారని చెప్పారు.ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయక పోవడంతో వెంటనే తనకి తెలిసిన విశాఖ డిఎం శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెంటనే సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చి బ్యాంకు ఖాతాలో చెక్ లు బ్లాక్ చేయమన్నారని తెలిపారు. మోసగించిన వారిని పట్టుకొని న్యాయం చేయాలని అర్చకులు అధికారులని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement