Saturday, April 20, 2024

టీచర్ల బదిలీల దరఖాస్తుకు ఒక రోజు గడువు పెంపు

అమరావతి,ఆంధ్రప్రభ: టీచర్ల బదిలీలకు దరఖాస్తు చేసుకునే గ్రేడ్‌ 2 హెడ్మాస్టర్లు, టీచర్లకు గడువు తేదీని మరోరోజు పెంచారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీని ఈనెల 18వ తేదీ నుంచి 19వ తేదీకి మార్చారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల మేరకు బదిలీల మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేశారు.

ఈమేరకు సవరించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేశారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం 40 శాతం, ఆ పైన అంధత్వం ఉన్న టీచర్లకు బదిలీల నుండి తప్పించారు. అర్దోపెడిక్‌ సమస్యతో అంగవైకల్యం గల టీచర్లను కూడా బదిలీల నుంచి మినహాయించారు. అంధత్వం, ఆర్దోపెడిక్‌ సమస్య ఉన్న టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేస్తే అదనపు పాయింట్లు కేటాయిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement