Sunday, December 8, 2024

కోవూరులో పేలుడు.. ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు..

కోవూరు, (ప్రభ న్యూస్‌) : హిందూ స్మశాన వాటిక వద్ద నిన్న‌ రాత్రి భారీ పేలుడు సంభవించిన సంఘటన కోవూరు స్మశాన వాటికలో చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి కర్మక్రతువుల భవనం ధ్వంసమైంది. పేలుడు జరిగిన చోట పది అడుగుల మేర గుంత ఏర్పడింది. దాదాపు రెండు కిలో మీటర్ల మేర పేలుడు శబ్ధం వినిపించడంతో కోవూరు పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి సమీపంలోని విద్యుత్‌ స్తంభాలు ఎగిరి పడగా , విద్యుత్‌ తీగలు తెగిపోయాయి . పరిసర ప్రాంతంలోని ఇళ్ల కిటికీల అద్దాలు , రేకులు పగిలిపోయాయి . శిధిలాల కింద ఎవరైనా ఉండొచ్చేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి పట్టణంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది .

ఈ రొజు కోవూరు నియో జకవర్గంలోని వరద ప్రాంతాల్లో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉండడంతో రాష్ట్ర ఇంటలిజెన్స్‌ అధికారులు , టీడీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుడుకు కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కోవూరు సీఐ రామకృష్ణారెడ్డి , ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు ఆ ప్రాంతంలోకి ప్రజలెవ్వరూ రాకుండా అడ్డుకున్నారు. సంఘటనా స్థలం భయానకంగా ఉండడంతో పేలుడులు తలుచుకుని ప్రజలు భీతిల్లుతున్నారు. ఈ పేలుడును అనేక కోణాల్లో విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement