Sunday, October 6, 2024

మాజీ మంత్రి నారాయ‌ణ బెయిల్ ఆరు వారాల‌కు పొడిగింపు..

మాజీ మంత్రి, టీడీపీ నేత‌ నారాయణకు బెయిల్ పొడగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ ను మరో ఆరు వారాలకు పొడిగించింది. పదవ తరగతి పరీక్ష పత్రాల లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు గతంలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు బెయిల్ రాగా… ప్రస్తుతం కోర్టు మరో ఆరు వారాలకు బెయిల్ ను పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement