Thursday, April 25, 2024

ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్​ వేయాలి: కలెక్టర్​ సూర్యకుమారి

విజయనగరం, (ప్రభ న్యూస్‌) : విజయనగరం మండలం దుప్పాడ, జొన్నవలస గ్రామసచివాలయాలను, రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ వేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఏ ఒక్కరినీ మినహాయించవద్దని స్పష్టం చేసారు. ముందుగా జొన్నవలస సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌, వివిధ రకాల రికార్డులను తనిఖీ చేసారు. వ్యాక్సినేషన్‌, ఓటీఎస్‌, జగనన్న కాలనీల నిర్మాణం, ఇతర ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. పెండింగ్‌ దరఖాస్తులపై ఆరా తీసారు.

ఇక్రాప్‌ నమోదు, ఈకేవైసీల గురించి ప్రశ్నించారు. అమ్మఒడి, ప్రకృతి సేద్యంపై ప్రశ్నించారు. గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతుందని తెలుసుకొని, గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా రూపొందించాలని సూచించారు. అలాగే దుప్పాడ గ్రామసచివాలయాన్ని సందర్శించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో మాట్లాడారు. ఓటీఎస్‌ పథకాన్ని వేగవంతం చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులందరికీ అవగాహన కల్పించి, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వినియోగించుకొనేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement