Thursday, March 28, 2024

ఏలూరు: 47 డివిజన్లలో వైసీపీ విజయం..

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా, 47 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన 3 డివిజన్లు టీడీపీకి దక్కాయి. గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించగా, 44 డివిజన్లలో వైసీపీ విజయభేరి మోగించింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క డివిజన్ లోనూ గెలుపు దక్కలేదు. అధికార వైసీపీ ధాటికి విపక్ష టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఏలూరు కార్పొరేషన్ ఫలితాల ద్వారా స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం మరోమారు స్పష్టమైంది.

ప.గో. జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 50 డివిజన్లలో ఫలితాలు వెల్లడయ్యాయి.
47 డివిజన్లలో YSRCP, 3 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. మొత్తం 50 డివిజన్లకు గాను మూడింటిని గతంలోనే వైసీపీ ఏకగ్రీవం
చేసుకుంది. 47 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా వైసీపీ 44 డివిజన్‌లను గెలుచుకుంది. మొత్తం మీద వైసీపీకి 47, టీడీపీకి 3 డివిజన్లు
దక్కాయి.

✪ 1వ డివిజన్‌ ఎ.రాధిక (వైసీపీ) విజయం
✪ 2వ డివిజన్ నరసింహారావు (వైసీపీ) గెలుపు, 787 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం.
✪ 3వ డివిజన్‌ బి.అఖిల (వైసీపీ) విజయం
✪ 4వ డివిజన్‌ డింపుల్ (వైసీపీ) విజయం, 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు
✪ 5వ డివిజన్‌ జయకర్ (వైసీపీ) విజయం, 865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం
✪ 10వ డివిజన్‌ పైడి భీమేశ్వరరావు (వైసీపీ) గెలుపు, 812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం
✪ 11వ డివిజన్‌ కోయ జయగంగ (వైసీపీ) గెలుపు, 377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం
✪ 12వ డివిజన్‌ కర్రి శ్రీను (వైసీపీ) గెలుపు, 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం
✪ 17వ డివిజన్‌ టి.పద్మ (వైసీపీ) విజయం, 755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు
✪ 18వ డివిజన్‌ కేదారేశ్వరి (వైసీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు
✪ 19వ డివిజన్‌ వై.నాగబాబు (వైసీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం
✪ 22వ డివిజన్‌ సుధీర్‌బాబు (వైసీపీ) గెలుపు
✪ 23వ డివిజన్ కె.సాంబ (వైసీపీ) విజయం, 1823 ఓట్ల మెజార్టీతో కె.సాంబ గెలుపు
✪ 24వ డివిజన్ మాధురి నిర్మల (వైసీపీ) గెలుపు, 853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం
✪ 25వ డివిజన్‌ గుడుపూడి శ్రీను (వైసీపీ) గెలుపు
✪ 26వ డివిజన్‌ అద్దంకి హరిబాబు (వైసీపీ) గెలుపు, 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం
✪ 31వ డివిజన్‌ లక్ష్మణ్‌ (వైఎస్సార్‌సీపీ) విజయం, 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు
✪ 32వ డివిజన్ సునీత రత్నకుమారి (వైఎస్సార్‌సీపీ) గెలుపు
✪ 33వ డివిజన్‌ రామ్మోహన్‌రావు (వైసీపీ) విజయం, 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌రావు గెలుపు
✪ 36వ డివిజన్ హేమ సుందర్ (వైసీపీ) విజయం
✪ 38వ డివిజన్ వైసీపీ అభ్యర్ధి విజయం, 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు
✪ 39వ డివిజన్ వైసీపీ అభ్యర్ధి విజయం, 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం
✪ 40వ డివిజన్‌ టి.నాగలక్ష్మి (వైసీపీ) గెలుపు, 758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం
✪ 41వ డివిజన్‌ వైసీపీ అభ్యర్ధి కల్యాణి విజయం, 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం
✪ 42వ డివిజన్ వైసీపీ అభ్యర్ధి విజయం, 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం
✪ 43వ డివిజన్ జె.రాజేశ్వరి (వైసీపీ) గెలుపు
✪ 45వ డివిజన్‌ ముఖర్జీ (వైసీపీ) గెలుపు, 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం
✪ 46వ డివిజన్‌ వైసీపీ అభ్యర్ధి ప్యారీ బేగం విజయం, 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు
✪ 48వ డివిజన్‌ స్వాతి శ్రీదేవి (వైసీపీ) విజయం, 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు
✪ 50వ డివిజన్‌ షేక్ నూర్జహాన్ (వైసీపీ) విజయం, 1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు

- Advertisement -

ఇది కూడా చదవండి : ఒలింపిక్స్‌ను విజయంతో మొదలుపెట్టిన మేరీకోమ్

Advertisement

తాజా వార్తలు

Advertisement