Thursday, September 12, 2024

Eluru – సతుల కోసం ప‌తుల దీక్ష‌..

ఏలూరు – త‌మ భార్య‌ల‌ను కాపురానికి పంపించాల‌ని కోరుతూ ప‌తులు నిరశ‌న దీక్ష చేస్తున్న ఘ‌ట‌న ఏలూరు చోటు చేసుకుంది.. వివ‌రాల‌లోకి వెళితే వి. పవన్‌, పీబీ శేషసాయిలు ఏలూరు కు చెందిన శ్రీనివాస రామానుజ అయ్య‌ర్ కు ఇద్ద‌రు కుమార్తెలను వివాహం చేసుకున్నారు.. కొన్నాళ్లు వారి రెండు కాపురాలు సక్రమంగానే సాగాయి.. ఇద్ద‌రు ఆ భార్య‌లు తండ్రిని చూసి వ‌ద్దామంటూ ఏలూరు వెళ్లారు. నెల‌లు గ‌డుస్తున్నా వెళ్లిన వాళ్లు తిరిగి రాలేదు.. పంచాయితీలు పెట్టిన ఫ‌లితం లేక‌పోయింది.. భార్య‌ల నుంచి కూడా ఉలుకు ప‌లుకు లేకుండా పోయింది..

చివ‌ర‌కుఉ ఈ సమస్యను జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాడు పవన్‌.. ఆయన ఎస్పీని కలవమని సూచించారు.. ఎస్పీ డీఎస్పీని విష‌యం చెప్పారు.. అయినా స‌రే వాళ్ల మామ భార్యను కాపురానికి పంపించడం లేద‌ని వాపోయాడు.. చివ‌రికి త‌న కూతురును చూపించడం లేద‌ని, .. ఫోన్‌ చేసినా ఉపయోగం లేకుండా పోయిందంటున్నాడు. త‌న పాపకు త‌న‌పై నెగిటివ్‌గా చెబుతున్నార‌ని,.. బర్త్‌డే విషెస్‌ చెప్పినా.. నెగిటివ్‌ ఆడియో మెసేజ్‌లు పెట్టిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక వేరే దారి లేక త‌న తొడ‌ల్లుడితో క‌ల‌సి ఇలా దీక్షకు దిగినట్టు చెప్పాడు పవన్‌..

- Advertisement -

పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను  కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళ పై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ బికె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు స్థానిక కలక్టరేట్ వడ్ఢ రిలే నిరాహార దీక్షకు దిగారు ఈ అల్లుళ్లు…. అక్క‌డో ఫ్లెక్సీ కూడా క‌ట్టారు..

అందులో

  • మా భార్యలను కాపురానికి పంపించాలి..
  • కన్న కూతురిని తండ్రికి చూపించాలి..
  • కూతుళ్లను కాపురానికి పంపించకుండా అల్లుళ్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి..
  • శాడిస్ట్‌ మామయ్య బీకే శ్రీనివాస రామానుజ అయ్యంగర్‌పై చర్యలు తీసుకోవాలి.. ఇట్లు మోసపోయిన అల్లుళ్లు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు..
Advertisement

తాజా వార్తలు

Advertisement