Thursday, March 28, 2024

ఏడాది ముందే ఎపిలో ఎన్నిక‌ల వేడి – వైసిపితో టిడిపి ఢీ

అమరావతి,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సయమం దాదాపుగా ఉన్నా అధికార, ప్రతిపక్షాలు ఇప్పు డే జోరును పెంచి పోరుకు సిద్ధమౌతున్నాయి. దీంతో రాజకీయ కాక పెరిగింది. ఒ
కవైపు అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం ఎత్తులు, పొత్తులతో ముందుకు సాగుతుంటే దానికి ధీటైన జవాబు ఇచ్చేందుకు అధికార పక్షం సన్నా హాలు మొదలు పెట్టింది. ఎవరికి వారే ఎత్తులు వేస్తూ ముందుకు సాగడంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పుడు రాజకీయమంతా 175 స్థానాల చుట్టూ తిరుగుతోంది. అధికార పక్షం 175 వై నాట్‌ అంటుండగా ప్రతిపక్ష తెలుగు దేశం 175లో ఓడిస్తామని సవాళ్లు విసురుతోంది.. ఇదే సమయంలో ఇరుపార్టీల అధినేతలు మైండ్‌ గేమ్‌కు తెర తీయడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈసారి ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ అయిన వైకాపా కసరత్తు చేస్తుంటే తెలుగుదేశం కూడా తన వంతు ప్రయత్నాన్ని అధికారం కోసం చేస్తూ వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న ఆపార్టీ ఆజోరును మరింత పెంచి సార్వత్రిక ఎన్నికల్లో సిద్ధమౌతున్నారు. 175 అసెంబ్లి స్థానాల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయా లని అధికార పక్షం సవాల్‌ విసురుతోంది. పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగాలని ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీకి సవాళ్లు విసురుతుంటే ఇప్పుడు టీడీపీ కూడా కౌంటర్‌ అటాక్‌ మొదలు పెట్టింది. అధికార పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం చేయడంతోపాటు తమతో కలిసి పోరాటానికి ముందకు రావాలని మిగిలిన రాకీయ పక్షాలను ఆపార్టీ అధినేత చంద్రబాబు పదే పదే పిలుపునిస్తున్నారు. దీంతో పొత్తులు ఖాయంగా కనిపిస్తున్నాయి. దాదాపు జనసేనతో టీడీపీ అవగాహనా ఒప్పందం కుదిరినట్లుగా ఇప్పటికే భారీ ప్రచారం జరుగుతోంది. ఇదే బాటలో వామపక్షాలు కూడా పయనిస్తున్నాయి.

ఇక కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ మాత్రం రెండు పడవలపై కాళ్లు వేసి నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్‌ రాజకీయంగా పెను చర్చకు దారితీశాయి. అధికార పార్టీ నుం డి 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వారందరినీ హోల్డ్‌లో పెట్టిన ట్లుగా చెప్పడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. గతంలో టీడీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటుచేసి వైకాపాతో నడుస్తుంటే ఇప్పుడు అదే పార్టీకి చెందిన నలుగురు సభ్యులు దాదాపుగా టీడీపీతో నడుస్తున్న పరిస్థితి ఎమ్మెల్సీ ఎన్ని కల్లో బహిర్గతమైంది. టీడీపీ ఎన్నికల పోరుకు ఇప్పటి నుండే పూర్తిస్థాయిలో సన్నా హాలు మొదటు పెట్టడంతో అధికార పార్టీ కూడా అదే స్థాయిలో ప్రతి వ్యూహాలు రచి స్తూ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఒకవైపు టీడీపీ మైం డ్‌ గేమ్‌కు తెర తీయడంతో అధికార పార్టీ కూడా తమ వ్యూహాలను సిద్ధంచేసి విమర్శలు, ఆరోపణలకు అదేస్థాయిలో బదులిచ్చే పనిలో నిమగ్నమైంది

తెలుగు దేశం పార్టీ రోజుకు ఒక జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అధికార పార్టీ అవినీతికి పాల్పడుతుందంటూ ఆరోపణలు చేస్తూ రాజకీయ దాడిని పెంచింది. యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న లోకేష్‌ కూడా ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిని ఎండగడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమె త్తుతున్నారు. సెల్ఫీ ఛాలెంజులు, డ్రోన్‌ వీడియోలతో ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ కూడా వీటిని తిప్పి కొట్టేందుకు ముప్పేట దాడికి దిగుతోంది.
తాజాగా ధర్మవరం సవాళ్లు అనంతపురం జిల్లా నుండి అమరావతికి చేరాయి. లోకేష్‌ ధర్మవరంలో ఆరపణలుచేస్తే కేతిరెడ్డి అమరావతికి వచ్చి రిటర్న్‌ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మొత్తంగా గత వారం రోజు లుగా రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీ యంగా అసక్తిని రేపుతున్నాయి. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలన్నీ చూస్తే 175 నియోజకవర్గాల్లో ఒకరు గెలుస్తామంటూ అదే 175 నియోజకవర్గాల్లో ఓడిస్తా మంటూ మరొకరు చెబుతుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement