Wednesday, December 11, 2024

నారా లోకేశ్ పై కోడి గుడ్లతో దాడి

ప్రొద్దుటూరు – యువగళం పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ కి చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో లోకేశ్ పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నాయకులు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లోకేశ్ పై దాడితో అక్కడ హైటెన్షన్ నెలకొంది. గుడ్డు విసిరిన వ్యక్తి టీడీపీ కార్యకర్తలు పట్టుకుని చితక్కొట్టారు.

ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కొంత ఉద్రికత్త నెలకొంది. అలర్ట్ అయిన పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement