Saturday, April 20, 2024

ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ సోదాలపై ఈడీ కీలక ప్రకటన..

విజయవాడ, కాకినాడ, గుంటూరుతో పాటు హైదరాబాద్ లో ఈనెల 2, 3 వ తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ సోదాలపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు 53 చోట్ల స్థిరాస్తులను ఈడీ అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలలో నగదుతో పాటు పలు కీలక పత్రాలు, ఆస్తులను సీజ్ చేశామని తెలిపింది.

ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేసినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి అడ్మీషన్ల పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని, ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతా నుంచి ఎన్ఆర్ఐఏఎస్ అనే మరో ఖాతాలకు బదిలీ చేశారని ఈడీ తెలిపింది. కరోనా సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారని పేర్కొంది. ఆ ఆదాయాన్ని ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని ఈడీ గుర్తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement