Monday, April 15, 2024

తమ్మిలేరులో గుర్తుతెలియ‌ని మృతదేహం ల‌భ్యం..

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు తమ్మిలేరు కాలువ కోమడవోలులో 55-60 సంవ‌త్స‌రాల వయసు మధ్య గల ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. అతను మాసిన గెడ్డం, ఒంటిపై మెరూన్ కలర్ షర్ట్, బ్లూ కలర్ నిక్కర్ కలిగి ఉన్నట్లు ఏలూరు వన్ టౌన్ ఇన్ స్పెక్ట‌ర్ ఆది ప్రసాద్ తెలిపారు. సదరు వ్యక్తి సమాచారం తెలిసిన వారు ఎవరైనా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు ఫోన్ నెంబర్ 9440796636 కు గాని, ఏలూరు 1 టౌన్ ఇన్ స్పెక్ట‌ర్ ఆది ప్రసాద్ ఫోన్ నెంబర్ 9440796604 కు సమాచారాన్ని తెలియచేయవలసిందిగా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement