Friday, June 18, 2021

లారీ బీభత్సం – ఇద్దరు పోలీసుల దుర్మ‌ర‌ణం

సామర్లకోట మండలం ఉండూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాతి 2 గంటల సమయంలో ఇద్దరు పెట్రోలింగ్‌ పోలీసులపైకి దూసుకెళ్లడంతోవారు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను కాకినాడ తిమ్మాపురం పోలీస్‌స్టేషన్ హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ, హోంగార్డు ఎన్‌ఎస్‌రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ విజయవాడ నుంచి వస్తున్న కరోనా వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్లారు. ఈ క్రమంలో ఉండూరు వంతెన వద్ద వాహనం కోసం నిరీక్షిస్తున్న క్రమంలో లారీ వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News