Monday, June 5, 2023

‘జగనన్న ప్రాణవాయువు’ రథచక్రాల వాహనాలను ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’ వాహనాలను ఎంపీ మార్గాని భరత్‌ గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ పద్ధతికి ఆయన శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా రాజమహేంద్రవరంలో కోవిడ్‌ బాధితులకు బస్సులో వైద్యమందించే విధానం విజయవంతమైతే ఎంపీ భరత్‌రామ్‌ దీన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 36 సీట్లు సామర్థ్యం గల ఈ బస్సులో ఆరు పడకలను ఏర్పాటు చేశారు. రెండు బస్సులను సిద్ధం చేయగా వాటిలో మొత్తం 12 బెడ్లు అందుబాటులో ఉంటాయి. వీటికి ఆక్సిజన్‌ సదుపాయం ఏర్పాటు చేసి మినీ ఐసీయూలా తయారుచేశారు. ఆసుపత్రిలో బెడ్‌ లేక ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడేవారికి బెడ్‌ దొరికేవరకు ఈ బస్సులో ఉంచి ఆక్సిజన్‌ అందించనున్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ గ్యారేజ్‌లోంచి రెండు వెన్నెల బస్‌లను ఈ సేవలకు వినియోగిస్తున్నారు. చాలామంది ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు రూపకల్పన చేసినట్టు ఎంపీ భరత్‌రామ్‌ తెలిపారు.

సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

- Advertisement -
   

కొత్తపేట: రావులపాలెంలో కోవిడ్ బాధితుల కోసం భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కోవిడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ కళాశాల మైదానంలో కోవిడ్ నిర్థారణ పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు ఉచితంగా మందులు కిట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేశారు. అలాగే నియోజకవర్గం అంతా సోడియం హైప్రోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయడానికి ఆరు మోబైల్‌ వాహనాలను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement