Saturday, April 20, 2024

కాకినాడ జయలక్ష్మి కో-ఆపరేటివ్‌ సొసైటీలో రూ.580 కోట్లు గోల్‌మాల్‌!

తీవ్రంగా పరిగణించిన హైకోర్టు
నిందితుల బెయిల్‌ పిటిషన్‌ తిరస్కృతి

అమరావతి, ఆంధ్రప్రభ:కాకినాడ కేంద్రంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న జయలక్ష్మి మ్యూచువల్లిd ఎయిడెడ్‌ మల్టిdపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో రూ. 580 కోట్ల మేర గోల్‌మాల్‌ జరిగినట్లు తేలింది.. ఈ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో పాటు దీన్ని తీవ్రమైందగా పరిగణించింది. సొసైటీ 19వేల మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ. 580 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసింది. వసూలు చేసిన ఈ డబ్బును సొసైటీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా సొంత అవసరాలకు మళ్లించింది. సొసైటీ చైర్మన్‌ రాయవరపు సీతారామాంజనేయులు, వైస్‌చైర్మన్‌ రాయవరపు బదరీ విశాలాక్షితో పాటు ఇతర డైరెక్టర్లు, వారి బంధువులు పెద్దమొత్తంలో సొసైటీ నుంచి రుణాల రూపంలో నగదు తీసుకుని తిరిగి చెల్లించలేదు. సొసైటీ నుంచి తీసుకున్న డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. అంతేకాదు ఎంకే ఫిలిం ప్రొడక్షన్స్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటుచేసి తెలుగులో ఓ సినిమా కూడా తీశారు. నిధులు ఇష్టారాజ్యంగా పక్కదారి ప ట్టటంతో డిపాజిటర్ల సొమ్ము తిరిగి ఇవ్వలేక చేతులెత్తేశారు. డిపాజిట్ల గడువు ముగిసినా బాండ్లకు తిరిగి సొమ్ము చెల్లించక పోవటంతో ఈ వ్యవహారం పై అధికారులు ఆడిట్‌ నిర్వహించారు. సొసైటీలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నా యని నిర్థారించారు.

ఆడిట్‌ రిపోర్టులో తేలటంతో దీనిపై కాకినాడ జిల్లా కోఆపరేటివ్‌ అధికారి బీ కనకదుర్గాప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లతో సహా పలువురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైల్లో రిమాండ్‌లో ఉన్న నిందితుల్లో ఒకరైన మంగళపల్లి వెంకట సుబ్రహ్మణ్య కుమార్‌ బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరుపున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. గత 40 రోజులుగా పిటిషనర్‌ జైల్లో ఉన్నారని కేసు దర్యాప్తు తుది దశలో ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. సీఐడీ తరుపున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరాం, వై శివకల్పనారెడ్డి జోక్యం చేసుకుం టూ ఈ బాగోతం వెనుక భారీ కుట్ర ఉందన్నారు. అధిక వడ్డీ ఆశచూపి నిందితులు అమాయక ప్రజల అవ సరాలను ఆసరాగా తీసుకుని కూడబెట్టుకున్న సొమ్మును స్వాహా చేశారని డిపాజిటర్ల నుంచి వందల కోట్లు వసూలు చేశారని ఆ డబ్బును దారి మళ్లించారని వివరించారు. నిధుల మళ్లింపులో భాగంగా కొన్ని షెల్‌ కంపెనీలను సృష్టించారని ఎంకే ఫిలిం ప్రొడక్షన్‌ పేరుతో సంస్థను స్థాపించి ఓ సినిమాను కూడా చిత్రీకరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న న్యాయ మూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి ఈ స్కాం తీవ్రమైందని అభిప్రాయపడ్డారు. ఈ దశలో నిందితులకు బెయిల్‌ మంజూరు చేయలేమని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంలో బెయిల్‌ మంజూ రుకు పిటిషన్‌ దాఖలు చేసిన మంగళపల్లి వెంకట సుబ్రహ్మణ్యకు మార్‌తో పాటు మరికొందరిపై 18 కేసులు నమోదయినట్లు హైకోర్టు గుర్తించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. పిటిషనర్‌ను సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఈ నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేయటం సాధ్యపడదని స్పష్టం చేసింది. మార్గదర్శి వంటి ప్రముఖ సంస్థలే ఇటీవల అభియోగాలను ఎదుర్కొం టున్న సంగతి విదితమే. ఆర్థిక నేరాలకు సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టం చేసే దిశగా గత కొద్ది నెలలుగా వివిధ డిపాజిట్‌ సంస్థల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీన్ని హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో బెయిల్‌ మంజూరుచేసే పరిస్థితు లులేవని చెప్తూ నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement