Saturday, March 25, 2023

కోడి పందాల బ‌రిలో రామ్ గోపాల్ వ‌ర్మ సంద‌డి..

కాకినాడ: ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా కాకినాడకు వ‌చ్చారు..ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి చేరుకున్న ఆర్జీవీ అక్కడ అల్పహారం స్వీకరించారు. పండుగ ఆన‌వాయితీగా జ‌రుగుతున్న కొడిపందాల‌ను ఆయ‌న వీక్షించారు.. వలసపాకలో కోడిపందాలను ఆయన తిలకించారు. పందెంలో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రామ్‌గోపాల్‌వర్మతో పాటు నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు. ఆర్జీవీ రాకతో కాకినాడలో సందడి వాతావరణం నెలకొంది. స్థానికులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement