Wednesday, April 24, 2024

దుర్గ గుడి ఈవోకి న‌జ‌రానా… అవాక్కైన ఎసిబి…

కాకినాడ, : వడ్డించే వాడు మనవాడైతే వరస చివర కూర్చున్నా పంచభక్ష్య పరమాన్నాలు అందుతాయన్నది సామెత. అవినీతి అక్రమాలకు బాధ్యుడని అవి నీతి నిరోధక శాఖ నివేదిక ఇచ్చి చర్య తీసుకోవా లని సూచిస్తే ఏకంగా ఆ శాఖ అధికారులు ఆ అధి కారికి మరింత కీలక పదవిని అప్పగించారు. ఏకంగా ప్ర‌మోష‌న్ తో కూడిన రాజ‌మండ్రి రీజిన‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ గా బ‌దిలీ చేశారు.. దేవాదాయ శాఖ జాయింట్‌ కమి షనర్ హూదాలో విజయవాడ కనకదుర్గ దేవస్థానం కార్యనిర్వ హణాధికారి ఎం వి సురేష్‌ బాబు పని చేస్తున్నారు. ఆది నుంచి ఆయనపై ఆరోపణలు న్నాయి. రెగ్యులర్‌ పదోన్నతి కాకుండా అడ్‌ హాక్ పదోన్నతులు ఆయన పొందారు .అయితే ఆయన గతంలో తూర్పు గోదావరి జిల్లా అన్న వరం కార్యని ర్వహణాధికారిగా పని చేసినప్పుడు పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు.వ్రత పురోహితులు సమ్మె కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆయ నను విజయవాడ కన కదుర్గ దేవస్థానం ఈవో గా నియమించారు. ఆయన అక్కడ చేరినప్పటి నుంచి వివాదాలు జరు గుతూనే ఉన్నాయి. అమ్మవారికి భక్తులు సమర్పిం చిన ఖరీదైన చీరలు మాయం అయ్యాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అనంతరం వాటిన స్వాధీనం చేసుకున్నారు. అమ్మవారి రథానికి సంబంధిం చిన మూడు సింహాలు మాయమయ్యాయి. దీనిపై ఈవో పట్టించుకోలేదన్న ఆరోపణలు ఆ శాఖ అధికారులే చేశారు. ఇదిలాఉండగా ఈ ఆలయంలో గత నెలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుసగా మూడు రోజులు తనిఖీలు జరిపారు. 20కి పైగా అక్రమాలు గుర్తించారు .ఈఓను సెలవుపై పంపాలని ప్రభుత్వం ఆదేశిం చింది. అయితే ఆయనకున్న అండదండలతో సెలవు పెట్టలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అవినీతి నిరోధక శాఖ అధికారులు పూర్తి స్థాయి నివేది కను అందజేశారు. ఇక్కడ జరిగిన అవినీతి అక్రమా లకు ఈవోకు సంబంధం ఉందంటూ నివేదిక ఇచ్చారు. దీంతో ఈసారి కచ్చితంగా ఆయన్ను సస్పెండ్‌చేస్తారని దేవాదాయ శాఖ వర్గాలు వెల్లడిం చాయి. అయితే సురేష్‌ బాబు కు రాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ అవినీతి కి బాధ్యుడిగా తేల్చినా సురేష్‌ బాబును సస్పెండ్‌ చేయలేదు సరికదా మరింత హూదా ఉన్న పదవి కట్టబెట్టారు. దీంతో దేవాదాయ శాఖ వర్గాలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి .రామతీర్థం హుండీ కౌంటింగ్‌ కు వెళ్లలేదనే ఒకే ఒక సాకుతో విజయనగరం జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ను సస్పెండ్‌ చేశారు. వాస్తవానికి హుండీ కౌంటింగ్‌ కు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎక్కడా వెళ్లారు. ఆ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌లు లేదా ఇతర ఈవోలను పంపిస్తారు. కానీ హుండీ లెక్కింపు కోసం వెళ్లలేదన్న సాకుతో అసిస్టెంట్‌ కమిషనర్‌ ను సస్పెండ్‌ చేసిన దేవాదాయ శాఖ అవినీతి అక్రమాలకు బాధ్యుడని నేరుగా అవినీతి నిరోధక శాఖ నివేదిక ఇస్తే ఆయన పై కనీస చర్యలు కూడా తీసుకో తీసుకోకపోవటం తమ శాఖ లో పేరుకుపోయిన బంధుప్రీతి, లంచగొండితనంకు నిదర్శనమని పలువురు ఈవోలు బాహాటంగానే విమర్శిస్తున్నారు . రాజమండ్రి జాయింట్‌ కమిష నర్‌గా ఉన్న భ్రమరాంబ బుధవారం ఉదయమే సర్పవరం శ్రీభావనారాయణ స్వామి వారి ఆల యంలో జరుగుతున్న అవినీతి అక్రమాల ఫిర్యా దుపై విచారణ కు వచ్చారు. సాయంత్రం ఆమెను బదిలీ చేశారు. దీంతో విచారణ నిలిపివేసేందుకు భ్రమరాంబ ను బదిలీ చేశారా, లేక సురేష్‌ బాబుకు మరింత ఉన్నత పదవి కట్టబెట్టినందుకు ఈ బదిలీ చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారిం ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement