Monday, October 7, 2024

AP | జాతరలో తాటిపెద్దుల యుద్దం.. జనాల్లో భయం

(పిఠాపురం, ప్రభన్యూస్) : పిఠాపురం పైడితల్లి అమ్మవారి జాతరలో తాటిపెద్దుల యుద్దం ఆందోళన కలిగించింది. భారీ ఖాయంతో అవి తలపడుతుంటే చిన్నా పెద్దాలు బయంతో కకావికలు అయ్యారు. ట్రాఫిక్ స్థంబించింది. పైడితల్లి అమ్మవారి జాతరను స్థానిక రామాధియేటర్ సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఎక్కడ నుంచి వచ్చాయో రెండు పెద్ద తాటిపెద్దులు హఠాత్తుగా ఒకదానితో ఒకటి తలపడ్డ‌యి. వాటిని విడదీయడానికి తరమడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

వాటి మధ్య పోట్లాట‌ సుమారు అరగంటకు పైగా సాగింది. అవి పొడుచుకుంటూ తోసుకుంటూ చుట్టూ వున్న జనంపైన పడుతుంటే భయంతో జనం కకావికలు అయ్యారు. చివరకు కొందరు యువకులు కర్రలు తీసుకుని వాటిని అదిలించడం ద్వారా వాటిని వేరు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement