Friday, October 4, 2024

AP | అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు..

( ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో ) : విజ‌య‌వాడ ప్ర‌జ‌లు వ‌ర‌ద వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ప‌డ్డారని, అమ్మ‌వారి ఆశీస్సులు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కృషి వ‌ల్ల ఆ ఇబ్బందుల‌ను అధిక‌మించి ద‌స‌రా మ‌హోత్స‌వ‌ములు నిర్వ‌హించుకోవ‌టం ఆనందంగా వుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ పేర్కొన్నారు.

ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించేందుకు స‌క‌ల ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. ఇంద్రాకిలాద్రి పై డీఈవో ఆఫీస్ లో మంగ‌ళవారం దసరా మహోత్సవములు -2024 బ్రోచర్ ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము , దుర్గ గుడి ఈవో రామారావు తో క‌లిసి ఆవిష్క‌రించారు.

ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం అనంత‌రం అంద‌రూ క‌లిసి అమ్మవారి ద‌ర్శనం చేసుకుని ఆశీర్వ‌చ‌న మండ‌పంలో తీర్ధ‌ప్ర‌సాదాలు అందుకున్నారు. బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వ‌ర‌కు జ‌రిగే దసరా మహోత్సవాలకు అందరికీ ప్రత్యేక ఆహ్వానం అన్నారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చూసుకునేందుకు, ద‌స‌రా మ‌హోత్స‌వ‌ములు అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఒక క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. భ‌క్తులంద‌రూ అమ్మ‌వారిని వరద ముంపుల నుంచి విజయవాడ నగరాన్ని రక్షించాలని ప్రార్థించాలని ఎం.పి కేశినేని శివ నాథ్ కోరారు.

మాజీ కేంద్రమంత్రి, ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది.. అలాగే భ‌క్తుల సౌక‌ర్యార్ధం కాల్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. వచ్చే భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.

- Advertisement -

ద‌స‌రా న‌వ‌రాత్రుల మ‌హోత్స‌వ‌ముల‌కి సంబంధించి భ‌క్తులు వారి స‌ల‌హాలు ఇవ్వ‌వ‌చ్చ‌న్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఇంద్ర‌కీలాద్రి పై ప్ర‌తి ఏడు ద‌స‌రా ఉత్స‌వాలు జ‌రుగుతాయి…కానీ ఈఏడాది అత్యంత వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు.

విజయవాడ ప్రజలందరూ వ‌ర‌ద ముంపుతో బాధ పడ్డారని,.. సీఎం చంద్రబాబు నాయుడు కృషి, చొర‌వ వ‌ల్ల ప్ర‌జ‌లు, న‌గ‌రం అంతా సాధారణ స్థితికి వ‌చ్చిందన్నారు. ఆ విప‌త్క‌ర ప‌రిస్థితి నుండి బయటకు వచ్చి ఉత్సవాలు చేసుకుంటున్నామంటే అది అమ్మవారి దయ,ఆశీస్సులు వుండ‌టం వ‌ల్లే అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బొమ్మసాని సుబ్బారావు , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం ఎస్ బేగ్ , ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement