Friday, March 29, 2024

డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు.. బెంగళూరు కేంద్రంగా మత్తుమందు సరఫరా

కర్నూలు రూరల్‌ , ప్రభన్యూస్ : బెంగళూరు కేంద్రంగా సాగుతున్న మత్తు మందు సరఫరాను కర్నూలు పోలీసులు పసిగట్టి గుట్టురట్టు చేశారు. తీగలాగితే డొంకకదిలినట్లు తమకు అందిన సమాచారం మేరకు షేక్‌ సానుల్లా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారన చేసిన పోలీసులు డ్రగ్స్‌ ముఠా మూలాలు తెలుసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా బెంగళూరులో ఉండే రిజ్వాన్‌ అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో నరేంద్రసింగ్‌, ముగ్బుల్‌, తరుణ్‌ అనే ముగ్గురికి డ్రగ్స్‌ అందజేయడానికి వెళ్లుతున్నట్లు నింధితుడు సానుల్లా నేరం అంగీకరించాడు. ఈ మేరకు సానుల్లాపై కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు సానుల్లా సమాచారంతో రిజ్వాన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. రిజ్వాన్‌ విజయవాడలోని మరో ఇద్దరు వ్యక్తులను డ్రగ్స్‌ అమ్మినట్లు తెలింది.

దీంతో పోలీసులు విజయవాడకు చెందిన యశ్వంత్‌రెడ్డి, ఏకేశ్వరరెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లో నరేంద్రసింగ్‌, మగ్బుల్‌, తరుణ్‌ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్‌ సానుల్లా వద్ద నుంచి 4.3 గ్రాములు, యశ్వంత్‌రెడ్డి, ఏకేశ్వరరెడ్డిల నుంచి 3 గ్రాములమెట్‌ అనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు పోలీసులు తెలిపారు. రిజ్వాన్‌కు డ్రగ్స్‌ ఎక్కడ నుంచి వస్తుందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement