Friday, April 19, 2024

క‌రోనా కోసం ప్ర‌త్యేక మందు. ..డీఆర్డీవో. రెడ్డి ల్యాబ్స్ సృష్టి

హైద‌రాబాద్ : కోవిడ్‌19 చికిత్సకు మరో కొత్త మందు సిద్ధమైంది. భారత రక్షణశాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్డీవో), హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ సంయుక్తంగా ఒక మందును తయారుచేసి, క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేశాయి. 2డీజీ (2 డీఆక్సీడీగ్లూకోజ్‌) పేరుతో రూపొందించిన ఈ ఔషధాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. కోవిడ్‌19 వైద్యంలో ఇప్పటి వరకు ఇంజెక్షన్లు, టాబ్లెట్ల రూపంలో వివిధ రకాల మందులు మార్కెట్లోకి రాగా, తాజాగా రూపొందించిన ఔషధం పౌడర్‌ రూపంలో ఉంటుందని డీఆర్డీవో ప్రకటించింది. డీఆర్‌డీవోకు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అల¸్డ్‌ు సైన్స్‌, #హదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయరీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ సంయుక్తంగా 2డీజీ డ్రగ్‌ను తయారు చేశాయి. ఔషధం తీసుకున్న తర్వాత కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నారని, పైగా మెడికల్‌ ఆక్సిజన్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తోందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలియజేసింది. తద్వారా రోగులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చని పేర్కొంది.
స్వల్ప లక్షణాలు, ఓ మోస్తరు లక్షణాలు ఉన్న రోగులపై 2డీజీ బాగా పనిచేస్తుందని డీఆర్డీవో పరిశోధనల్లో తేలింది. శరీర కణాల్లో వైరస్‌ వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటోందని ఆ సంస్థ వెల్లడించింది. పౌడర్‌ రూపంలో లభించనున్న ఈ మందును నీళ్లలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. 2డీజీపై జరిగిన క్లినికల్‌ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయని డీఆర్డీవో వెల్లడించింది. మందును వాడిన కొన్ని రోజుల్లోనే కోవిడ్‌ రోగులు కోలుకున్నారని, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిందని వివరించింది. ఈ ఔషధం జెనరిక్‌ మాలిక్యూల్‌, గ్లూకోజ్‌ అనలాగ్‌ కావడం వల్ల ఉత్పత్తి చాలా సులువని, పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుందని డీఆర్డీఓ వెల్లడించింది. ఇది వాడిన కరోనా రోగులు ఇతర కరోనా రోగుల కంటే వేగంగా కోలుకున్నట్లు తెలిపింది.
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న సమయంలో ఏప్రిల్‌ నెలలో డీఆర్డీవోఇన్మాస్‌ శాస్త్రవేత్తలు, సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) స#హకారంతో తొలుత ల్యాబొరేటరీ ప్రయోగాలు నిర్వ#హంచారు. కరోనా వైరస్‌ వృద్ధిని 2డీజీ సమర్థవంతంగా అడ్డుకుంటుందని గుర్తించారు. ఆ పరిశోధనల ఆధారంగా మనదేశంలో ఫేజ్‌2 ట్రయల్స్‌కు డీసీజీఐ మే నెలలో అనుమతి ఇచ్చింది. ఫేజ్‌2లోనూ ఆశాజనక ఫలితాలు వచ్చాయి. దీంతో గత ఏడాది డిసెంబరు నుంచి మార్చి, 2021 వరకు మూడో దశ ప్రయోగాలు నిర్వ#హంచారు. ఢిల్లి , యూపీ, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులోని 27 ఆస్పత్రుల్లో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వ#హంచారు. ఈ ఔషధం వల్ల రోగి త్వరగా కోలుకోవడంతో పాటు సురక్షితమని ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల ఆధారంగా 2డీజీ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement