భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇంకా లక్షలాది మంది ప్రజలు జలదిగ్భందంలోనే చిక్కుకున్నారు. ఇలాంటి వారికి నిత్యవసర సరుకులను ఉచితంగా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రేపటి నుంచి (శుక్రవారం) విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి కార్యక్రమాన్ని చేపడుతామ అని ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో 12 అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 2 లక్షల మందికి సరకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement