Saturday, November 30, 2024

Derailed goods – ముమ్మరంగా కొనసాగుతున్న మరమ్మత్తు పనులు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ పట్టాలు తప్పి ట్రాక్ పై పడిన గూడ్స్ రైలు బోగిలు తొలగించడంతోపాటు ట్రాక్ మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి పెద్దపల్లి జిల్లా రాఘవపూర్, కన్నాల మధ్యలో ఐరన్ కాయిల్స్ తీసుకువెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 12 భోగీలు రైల్వే ట్రాక్లపై పోయిన విషయం విధితమే.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు భారీ జెసిబిలు తెప్పించి మరమ్మతు పనులు చేపడుతున్నారు. మెయిన్ లైన్ రైల్వే ట్రాక్ 600 మీటర్లకు పైగా పూర్తిగా తొలగిపోయింది. రైల్వే ట్రాక్ పైన పడిపోయిన భోగిలను తొలగించారు. ట్రాక్ మరవత్తు పనులు ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఒక లైన్లో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement