Thursday, November 7, 2024

KNL: ధనలక్ష్మీగా కర్నూలు వాసవీ మాత దర్శనం.. రూ. కోట్లతో అలంకరణ

కర్నూలు బ్యూరో : కర్నూలు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం (చిన్నమ్మ వారి శాల, పూల బజార్) నందు.. శనివారం వాసవీ మాతకు రూ.3 కోట్ల (₹500, 200, 100, 50, 10) కొత్త నోట్లతో ధనలక్ష్మి అలంకారంలో శ్రీ వాసవి మాతను అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి శాలకు విచ్చేసిన భక్తులు ధనలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

మేడపైన జ్ఞానేశ్వరమ్మ ఆధ్వర్యంలో అరుణాచల గిరి ప్రదక్షిణ, గుండ శ్రీదేవి బృందంచే కోలట నృత్య ప్రదర్శన, చిన్న పిల్లలచేత భక్త ప్రహ్లాద నాటకం చాలా కన్నుల‌ పండుగగా జరిగినట్లు చిన్న అమ్మవారి శాల ఆలయ కమిటీ కార్యవర్గం సభ్యులు ఇల్లూరు రవీంద్రుడు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement